హైడ్రో పవర్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని ధర్నా

ASR: హుకుంపేట మండలం బూర్జ గ్రామం వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని ఆదివాసీలు సోమవారం ఆందోళనకు దిగారు. సీపీఎం పార్టీ నాయకులతో కలసి రాళ్లగెడ్డ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రం హుకుంపేటలో ధర్నా చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.