కంభం మాజీ సైనికుల ఆధ్వర్యంలో సంబరాలు

కంభం మాజీ సైనికుల ఆధ్వర్యంలో సంబరాలు

ప్రకాశం: మార్కాపురం జిల్లాగా ప్రకటించడంతో కంభంలో మాజీ సైనికుల సంఘం భారీగా చేరుకొని సంబరాలు చేసుకున్నారు. అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ.. 'పశ్చిమ ప్రాంత మాజీ సైనికుల దశాబ్దాల కల నెరవేరింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంకి, జిల్లాను సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు' తెలిపారు.