ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించిన దుండగులు
NRPT: ఊట్కూర్ నాగిరెడ్డిపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహాదేవప్ప 3 ఎకరాలకు పైగా ఉల్లిగడ్డ పంటను సాగు చేశాడు. అయితే మార్కెట్‌లో లేకపోవడంతో ఉల్లిగడ్డను గ్రామంలో ఒకచోట రాశిగా పోశాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించినట్లు తెలుస్తోంది.