రైతుబీమా నిధుల కుంభకోణంపై ఫిర్యాదు

NRML: నర్సాపూర్ (జీ) మండలం చాక్పల్లి క్లస్టర్‌కు చెందిన ఏఈవో కాల్వ రమ్య సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫోర్జరీ సంతకాలు చేసి రైతుబీమా పథకం నిధులను కొందరు దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.