కర్నూల్‌లో మోగా జాబ్ మేళా

కర్నూల్‌లో మోగా జాబ్ మేళా

KRNL: ఈ నెల 8న కర్నూలులోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డా. సిరి ప్రకటన విడుదల చేశారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 19 కంపెనీల్లో 1,350 ఖాళీల భర్తీ జరగనుండగా, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.