ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అవినాశ్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి పదేళ్ల బాలుడు మృతి చెందాడు. నిర్మల్‌కు చెందిన రాజశేఖర్ కుమారుడైన సహర్ష్ తన మేనమామ తిరుపతి వివాహం కోసం అక్కడకు వెళ్లగా తోటి చిన్నారులతో ఆడుకుంటూ భవనం పైనుంచి కిందపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారిస్తున్నారు.