ఘనంగా శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి

ఘనంగా శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి

VZM: ప్రముఖ భారతీయ తత్త్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిపారు. ఆలయ అర్చకులు చామర్తి రమేష్, శ్రీనివాస రమేష్ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీకృష్ణనికి అభిషేకాలు, అర్చన, ఉంజల్ సేవ జరిపారు. ఇందులో ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.