ప్రేమ్ రక్షిత్ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్ స్వయంగా ఆయనను ప్రశంసించడం విశేషం. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అద్భుతమని, ఆయన అకాడమీ (ఆస్కార్) సభ్యుడిగా ఉండటం సంతోషకరమని విన్సెంట్ కొనియాడాడు. ఈ ప్రశంసలతో ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రేమ్ రక్షిత్ పేరు మారుమోగుతోంది.