'యువత బాగుపడటం జగన్‌కు ఇష్టం లేదు'
PLD: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 16,345 టీచర్ పోస్టులు భర్తీ చేశామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గురజాలలో ఆయన మాట్లాడారు. యువత బాగుపడటం ఇష్టం లేని జగన్‌మోహన్ రెడ్డి మెగా డీఎస్సీని ఆపడానికి 24 కేసులు పెట్టారని విమర్శించారు. మెగా డీఎస్సీని ప్రవేశపెట్టిన ఘనత మంత్రి నారా లోకేష్‌కే దక్కుతుందన్నారు.