వరకట్న కేసులో నిందితులకు జైలు శిక్ష

వరకట్న కేసులో నిందితులకు జైలు శిక్ష

తిరుపతి కోర్టు వరకట్న వేధింపుల కేసులో నిందితులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించింది. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత వివరాల మేరకు.. తిరుపతి మాజీ కార్పొరేటర్ కుమార్తె ఫిర్యాదు మేరకు ఆమె భర్త హేమకృష్ణ, అత్తమామపై కేసు నమోదైంది. విచారణ అనంతరం 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈ తీర్పు వెలువరించారు.