రూ.2.36 కోట్లు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

రూ.2.36 కోట్లు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫేస్బుక్ పరిచయంతో రూ.2.36 కోట్లు మోసపోయాడు. మహిళ పేరుతో పరిచయమైన వ్యక్తులు ‘ఫేస్బుక్ స్టోర్’ పేరుతో ట్రేడింగ్ చేయమని నమ్మించి మూడు నెలల్లో భారీగా డబ్బు బదిలీ చేయించారు. లాభాలు చూపించినా డబ్బు ఇవ్వకపోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.