‘విద్య అంటే డిగ్రీ కాదు, దేశాన్ని మార్చే శక్తి’

‘విద్య అంటే డిగ్రీ కాదు, దేశాన్ని మార్చే శక్తి’

విద్య ప్రాముఖ్యతపై UP CM యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్య అంటే కేవలం సర్టిఫికెట్లు, డిగ్రీలు పొందడం మాత్రమే కాదని.. సమాజాన్ని, దేశాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనమని అన్నారు. విలువలను పెంపొందిస్తూ వ్యక్తులను ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతను నెరవేర్చినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని యోగి స్పష్టం చేశారు.