VIDEO: పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.