'ఎన్నికల హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకోవాలి'

VZM: ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం స్దానిక మున్సిపాలిటీలోని 8వ వార్డులో బాబు ష్యురిటీ - మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.