మంచినీటి పైపుల మరమ్మతులు
VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర కాలనీ 13వ వార్డులో గత కొన్ని రోజులుగా మంచినీటి పైపులు లీకై నీరు వృథాగా పోతున్న సమస్యపై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది శుక్రవారం విరిగిన పైపులు, వాల్వులను మార్చి మరమ్మతులు చేపట్టారు. ఈ మరమ్మతులతో నీటి వృథా ఆగిపోవడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.