పలిమెలలో భార్యాభర్తల రికార్డు.. నాలుగుసార్లు సర్పంచ్‌లు!
BHPL: పలిమెల మండలంలో భార్యాభర్తలు నాలుగుసార్లు సర్పంచ్‌లుగా ఎన్నికై అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో జువ్వాజి పుష్పలత 2001-2006, 2019-2024 కాలాల్లో మండల కేంద్ర సర్పంచ్‌గా ఏకగ్రీవంగా గెలిచారు. ఆమె భర్త జువ్వాజి తిరుపతి 2006-2013 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు వారికి అనుకూలంగా ఉండటమే కారణం. మొత్తం నాలుగుసార్లు ఈ జంట సర్పంచ్ పదవిని చేపట్టారు.