ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ విద్య

MBNR: ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించనుంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 94 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందజేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.