VIDEO: కావలిలో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం
NLR: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరిస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు. మంగళవారం ఆయన కావలి పట్టణంలోని పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.