'అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి'

'అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి'

ప్రకాశం: మార్కాపురం మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే పాత మిద్దెలు, పడిపోయిన స్తంభాలు, విద్యుత్ తీగలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు.