రూ.52.5కోట్ల అంచనాతో మున్సిపల్ బడ్జెట్
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఆర్థిక సంవత్సరం 2026-2027కి గాను రూ.52.5కోట్ల అంచనాతో మున్సిపల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆదాయ వనరులు పెంచుకొని, వ్యయాన్ని తగ్గించి మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని తెలిపారు.