మండలంలో వడగండ్ల వాన
KMR: తాడ్వాయి మండలంలో ఈదురు గాలుల హోరు, వడగండ్ల శబ్దం ఒక్కసారిగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. మండల వ్యాప్తంగా సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. పలు చోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అకాల వర్షం రైతులకు కోలుకోలేని దెబ్బ తీసింది. ముఖ్యంగా చేతికి వచ్చిన మొక్కజొన్న పంటలు వడగండ్ల ధాటికి నేలకొరిగాయి.