పలకలతో పాటలు.. బుడతడికి నెటిజన్ల ఫిదా!
మహారాష్ట్రకు చెందిన రెండో తరగతి విద్యార్థి దానిష్ షేక్, గచ్చు పలకలతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజరాత్ కళాకారుడిని స్ఫూర్తిగా తీసుకున్న ఈ బాలుడు, పాఠశాల వార్షికోత్సవంలో తన ప్రతిభను చాటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, గంటల్లోనే వైరలైంది.