నట్టల నివారణకు మందుల పంపిణీ

సూర్యాపేట: 27వ వార్డ్ కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీ కాంతమ్మ వేంకటేశ్వర్ల పర్యవేక్షణలో గురుకుల పాఠశాల బాలురు, అంగన్వాడి కేంద్రాల్లో గురువారం నట్టల నివారణకు మందుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రిన్సిపాల్ పుండరీక చారీ, యాదయ్య, జానీ పాషా, శారద, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.