కప్పలబండలో స్వచ్ఛ రథం ప్రారంభం

కప్పలబండలో స్వచ్ఛ రథం ప్రారంభం

సత్యసాయి: పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుధ్య మెరుగుదలకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. చెత్త సేకరణ, పరిశుభ్రత పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని కోరారు.