VIDEO: బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ
AKP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు జడ్పీ హైస్కూల్ విద్యార్థినులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అత్యవసర సమయాల్లో బాలికలు తమను తాము రక్షించుకునేందుకు ఈ శిక్షణ ద్వారా దోహద పడుతుందని అధికారులు అన్నారు. బాలికలు, మహిళల రక్షణకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.