వయోవృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ

VZM: జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ కుమార్తె సిరమ్మ బుధవారం భీమిలి మండలం, నిడిగట్టు గ్రామంలోని సాయి బాబా మందిరంను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ వయోవృద్ధులకు విశాఖ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఇళ్లాపువెంకట్ జగన్ ఏర్పాటు చేసిన చీరలు, పండ్లు, రొట్టెలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు. ఈసందర్బంగా వయో వృద్ధులు సిరమ్మను ఆశీర్వదించారు.