VIDEO: పేదలకు సొంతింటి కల నెరవేర్చింది కాంగ్రెస్: ఎమ్మెల్యే

VIDEO: పేదలకు సొంతింటి కల నెరవేర్చింది కాంగ్రెస్: ఎమ్మెల్యే

WNPT: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం గోపాల్పేట్ మండలంలోని చెన్నూరు గ్రామంలో ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేయించి, నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు నిరుపేదలకు అండగా నిలిచి, సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.