కాలువకు నీళ్లు విడుదల చేయాలని కేసీఆర్ ఫోన్

కాలువకు నీళ్లు విడుదల చేయాలని కేసీఆర్ ఫోన్

సిద్దిపేట: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు నీటి పారుదల శాఖ అధికారులు కాలువకు నీళ్లు వదిలారు. ములుగు(M) కోట్యాల, అల్లీ నగర్, అడవి మజీద్, క్షీర సాగర్, జప్తి సింగాయపల్లి వరకు కాలువలో నీటిని విడుదల చేశారు. పంటలు ఎండిపోతున్నాయని మాజీ డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అంజిరెడ్డి సమాచారం మేరకు కేసీఆర్ అధికారులకు ఫోన్ చేసి నీటిని విడుదల చేయాలని కోరారు.