బైక్‌తో ఎస్సైను ఢీకొట్టిన యువకుడు

బైక్‌తో ఎస్సైను ఢీకొట్టిన యువకుడు

NLR: ఇందుకూరుపేట మండలం జగదేవిపేట వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై నాగార్జునను వేగంగా వచ్చిన ఓ యువకుడు బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎస్సై గాల్లోకి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.