జగ్జీవన్ రామ్ ఆశయాలను పాటించాలి : కలెక్టర్

జగ్జీవన్ రామ్ ఆశయాలను పాటించాలి : కలెక్టర్

KKD: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరింధిర ప్రసాద్ సూచించారు. ఆదివారం స్వతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహనికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.