రేపు 'మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా': DEO
W.G: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం 'మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా'కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.