లంపి వైరస్ పై గో సంరక్షణ ఆందోళన

లంపి వైరస్ పై గో సంరక్షణ ఆందోళన

W.G: భీమవరంలో రోడ్లపై తిరిగే కొన్ని ఆవులకు లంపి వైరస్ సోకుతున్నందున, వాటిని సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్యం అందించాలని గో సంరక్షణ అధ్యక్షుడు సుంకర దాసు కోరారు. గురువారం ఆయన మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. లంపి వైరస్ ఒక ఆవు నుంచి మరొక ఆవుకు త్వరగా వ్యాప్తి చెంది ఇతర మూగజీవాలకు ప్రమాదమని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.