బిట్రగుంటలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ

NLR: బోగోలు మండలం బిట్రగుంటలో వైసీపీ మండల అధ్యక్షుడు మద్దిబోయిన వీర రఘు ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ నాయకులు పెడుతున్న అక్రమ కేసులకు నిరసనగా మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.