రాజన్న ఆలయ అభివృద్ధికి విరాళం
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన నీలారపు పద్మజ-శివకుమార్ దంపతులు రూ.1,00,016 విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఇవాళ ఆలయ ఏఈవో జి.శ్రావణ్ కుమార్‌కు ఈ మొత్తం అందజేశారు. అనంతరం పద్మజ శివకుమార్ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందజేశారు.