ఉండిలో మల్లేశ్వరస్వామి గ్రామోత్సవం
W.G: శ్రీ పార్వతి సమేత శ్రీ చెన్న మల్లేశ్వరస్వామి కళ్యాణ శివరాత్రి మహోత్సవాల సందర్భంగా గ్రామోత్సవ ఊరేగింపు కార్యక్రమం శనివారం రంగరంగ వైభవంగా నిర్వహించారు. కోలాటాల సందడి, బాణాసంచా కాల్పులు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను రథంపై గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. దీంట్లో నంది వాహనానికి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అలాగే ఊరేగింపు సందర్భంగా ప్రసాదం పంపిణీ చేశారు.