VIDEO: శివనగర్‌లో పెట్రోల్ దొంగలు హల్‌చల్
WGL: ఖిలావరంగల్ మండలం శివనగర్‌లో పెట్రోల్ దొంగలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రకాశం మెమోరియల్ పాఠశాల సమీపంలో ఇళ్ల ముందు నిలిపిన ద్విచక్ర వాహనాల నుంచి ఇద్దరు యువకులు పెట్రోల్ దొంగిలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.