గల్లంతయిన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు
SRCL: తంగళ్ళపల్లి మండలంలో మనస్థాపంతో మానేరు వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న చల్లంగుల కృష్ణ అనే కూలి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రం బ్రిడ్జిపై నుంచి దూకిన కృష్ణ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. శుక్రవారం ఉదయం రెస్క్యూ టీమ్ ద్వారా గాలింపు కొనసాగుతోందని, అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.