VIDEO: దూడల మల్లన్న జాతర ఏర్పాట్లలో తీవ్ర నిర్లక్ష్యం..!
WGL: పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో జరిగే దూడల మల్లన్న జాతరపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సోమవారం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్నా భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టలేదని విమర్శించారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.