జిహాద్‌పై జమియత్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
జిహాద్‌పై జమియత్ చీఫ్ మౌలానా మసూద్ మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అణిచివేత ఉన్నంతకాలం జిహాద్ ఉంటుందని వెల్లడించారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్‌వాపిపై కేంద్ర ప్రభుత్వం కేసులు వేసి సుప్రీంకోర్టు, హైకోర్టులపై ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా కోర్టులో సవాల్ చేస్తున్నట్లు మండిపడ్డారు.