VIDEO: ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు

VIDEO: ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు

VSP: జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసుల కోసం వినూత్నంగా ఏసీ హెల్మెట్లను ప్రవేశపెట్టారు. ప్రధాన కూడళ్లలో విధులు నిర్వహించే సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. బ్యాటరీతో పనిచేసే ఈ హెల్మెట్లు లోపల ఉష్ణోగ్రతను 10-15 డిగ్రీల వరకు తగ్గించి, పోలీసులకు ఉపశమనం కలిగిస్తాయన్నారు. సిబ్బందికి ఎండదెబ్బ తగలకుండా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.