నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

KNR: వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లికి చెందిన వెముజాల సత్తవ్వ, ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు భర్త, పిల్లలు లేకపోవడంతో కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సత్తవ్వ మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు.