VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
కృష్ణా: యలకుర్రు గ్రామంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న దానియేలు, రాజేష్‌కు రూ.1,21,212 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి స్వగృహాలకు వెళ్లి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం అందజేశారు. ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడకుండా, ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ప్రతి పథకం వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు నిర్భయంగా తెలియజేయాలన్నారు.