అధ్వానంగా మారిన రోడ్డు.. మెక్షం ఎప్పుడో?
KMR: బాన్సువాడ మండలం కథలాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు అద్వానంగా మారిందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రాత్రి వేళలో గుంతలను గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.