వాట్సాప్‌లో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే

వాట్సాప్‌లో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే

సత్యసాయి: వాట్సాప్‌లో వచ్చిన ఫిర్యాదుపై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి స్పందించారు. జాయ్ అలుకాస్ సహకారంతో నిర్మించిన సాయి చిల్డ్రన్స్ పార్క్ అపరిశుభ్రంగా ఉందన్న కంప్లైంట్‌పై ఆమె మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను రంగంలోకి దింపి, పార్క్ పరిసరాలను శుభ్రం చేయించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనను స్థానికులు అభినందించారు.