ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు

ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు

SRCL: రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం మండల అధ్యక్షుడు కందుకూరి రామ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం తంగళ్ళపల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో జయంత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ఆమోదించకపోతే నిరసనలు చేపడతామన్నారు.