కువైట్ యువరాజుకు మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖలేద్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కువైట్‌పై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం దౌత్యపరమైన చర్చలు నిరంతరం కొనసాగడం అత్యంత అవసరమన్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సురక్షితంగా, స్వేచ్ఛగా సాగడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని యువరాజుకు మోదీ తెలిపారు.