'మహిళ పోలీసు వ్యవస్థతో శాంతిభద్రతల పరిరక్షణ'

VZM: మహిళ పోలీసు వ్యవస్థ వచ్చిన తరువాత శాంతిభద్రతల పరిరక్షణ సులభతరమైందని భోగాపురం రూరల్ సీఐ జి రామకృష్ణ పేర్కొన్నారు. నెల్లిమర్ల మున్సిపాలిటీ, మండలానికి చెందిన 21 మంది మహిళా పోలీసులు తాజాగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిని స్థానిక ప్రయివేటు ఫంక్షన్ హాల్లో సీఐ రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్సై బి. గణేష్ ఇవాళ ఘనంగా సన్మానించారు.