ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్య

ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్య

MLG: వెంకటాపూర్ (M) నర్సాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అటికే పరమేష్ నిన్న రూ. 3 వేలు ఆన్‌లైన్ షాపింగ్ చేశాడని భార్య దివ్య మందలించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇవాళ భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా.. దివ్య ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.