తండ్రి కోసం ములాఖత్ కు వెళ్లిన కొడుకుకి జైలుశిక్ష

అదిలాబాద్: గంజాయి కేసులో సుభాష్ నగర్ కు చెందిన బాబుఖాన్ జైలులో ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. తన కుమారుడు అర్షద్ ఖాన్ జైలుకు వెళ్లి ములాఖత్ లో తండ్రిని కలుసుకొని మాట్లాడాడు. అనంతరం తనతో పాటు తీసుకొచ్చిన బీడీల కట్ట,మూడు గంజాయి పొట్లాలను జైలు గోడపై నుంచి తండ్రి కోసం విసిరేశాడు. అతన్ని అదుపులో తీసుకొని జైలుకు పంపారు.