VIDEO: కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

VIDEO: కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీలో కోతుల బెడద తీవ్రమైంది. తినుబండారాల కోసం ఇళ్లలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోతుల దాడుల్లో గాయపడిన ఘటనలు నమోదయ్యాయి. వీధుల్లో తిరిగే కోతుల గుంపుల వల్ల పెద్దలు, పిల్లలు రోడ్లపై నడవడానికి భయపడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.